News January 16, 2026
APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.
Similar News
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.
News February 21, 2026
NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.


