News September 24, 2024
APIIC ఛైర్మన్గా మంతెన రామరాజు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ (APIIC)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే టికెట్ త్యాగానికి దక్కిన ప్రతిఫలంగా నామినేటేడ్ పోస్టు వరించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 1, 2026
తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 1, 2026
పండుగలా పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్ మీట్లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
News December 31, 2025
జనవరి 5న జిల్లాలో గ్రామసభలు: కలెక్టర్

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలి కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గ్రామీణ్ పథకంపై పనులపై సమీక్షించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.


