News October 3, 2025

APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు: SP

image

బాపట్ల SP ఉమామహేశ్వర్ శుక్రవారం జిల్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్లు వినూత్న రీతిలో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ ద్వారా APK ఫైల్స్ పంపించి తద్వారా ఫోన్ హ్యాక్ చేస్తున్నారన్నారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారని తెలిపారు. ప్రజలు APK ఫైల్స్ డౌన్‌లోడ్ లేదా ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. కేవలం అధికారిక యాప్స్ మాత్రమే వాడాలన్నారు.

Similar News

News October 4, 2025

AP, TG న్యూస్ రౌండప్

image

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం

News October 4, 2025

మావోయిస్టులుగా అడవిలో ఉండి ప్రయోజనం లేదు: ఏసీపీ కృష్ణ

image

మావోయిస్టులుగా అడవుల్లో ఉండి ప్రయోజనం లేదని, ప్రజల జీవన స్రవంతిలోకి రావాలని PDPL ACP గజ్జి కృష్ణ అన్నారు. శ్రీరాంపూర్(M) కిష్టంపేట(V)లో మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మను పరామర్శించారు. రాజిరెడ్డి లొంగి, వృద్ధ తల్లిని చూసుకోవాలని సూచించారు. లొంగితే రివార్డు, ఉపాధి కల్పన ఉంటుందని వెల్లడించారు. వీరమ్మకు దసరాకు బట్టలు, పండ్లు, బియ్యం అందజేశారు. వెంట CI సుబ్బారెడ్డి, SI వెంకటేష్ తెలిపారు.

News October 4, 2025

KNR: అందరి దృష్టి కోర్టు తీర్పు పైనే..!

image

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీచేసి ఈనెల 9న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తుంది. ఐతే ఈనెల 8న బీసీ రిజర్వేషన్ల పై కోర్టులో విచారణ జరుగనుంది. ఏ తీర్పు వస్తుందోనని ప్రభుత్వానికి, ఆశావాహులకు దడ పెరుగుతుంది. దీంతో రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండగా, ఆశావహులు నిరాశలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646ఎంపీటీసీ స్థానాలున్నాయి.