News October 2, 2025

స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంట్రీ!

image

టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ కంపెనీ వ్యవహరిస్తుందని BCCI ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు మ్యాచులు ఆడింది. కాగా రేపటి నుంచి వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో అపోలో టైర్స్ పేరున్న జెర్సీలు ధరించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రాక్టీస్‌లో ప్లేయర్లు స్పాన్సర్ పేరున్న జెర్సీలనే ధరించారు. ఆ ఫొటోలను బీసీసీఐ Xలో షేర్ చేసింది.

Similar News

News February 17, 2026

నా దగ్గర అంత డబ్బు లేదు: మస్క్

image

ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ట్రిలియనీర్ అయ్యే ఛాన్స్ 75%పైనే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ.. తన వద్ద 0.1% కంటే తక్కువ డబ్బు ఉందన్నారు ఎలాన్ మస్క్. ఎక్కువ భాగం టెస్లా, స్పేస్ఎక్స్ వాటాల్లోనే ఉందన్నారు. టెస్లాలో 80%పైగా షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లవేనని తెలిపారు. ప్రస్తుతం మస్క్ సంపద $849.3B కాగా xAI, స్పేస్ఎక్స్ మెర్జ్‌తో ట్రిలియన్ మార్క్ టచ్ కానుందని అంచనా.

News February 17, 2026

కర్తరీ దోషం ఎలా ఏర్పడుతుంది?

image

ఖగోళ గమనం ప్రకారం.. సూర్యుడు మే నెలలో మేష->వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం గుండా ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి సూర్యుడు రోహిణి నక్షత్రం దాటే వరకు ఉన్న సమయాన్ని కర్తరీగా గణిస్తారు. దీనిని 2 రకాలుగా విభజిస్తారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నప్పుడు ‘చిన్న కర్తరీ’, మిగిలిన పాదాల్లో సంచరించేటప్పుడు ‘పెద్ద కర్తరీ’ ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి వల్ల భూమిపై వేడి గాలులు పెరుగుతాయి.

News February 17, 2026

SAILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>స్టీల్<<>> అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) బిలాయ్ స్టీల్ ప్లాంట్ 16 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 26న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS,పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 69ఏళ్లకు మించరాదు. వెబ్‌సైట్: https://sailcareers.com/