News September 19, 2024
9 ఏళ్లకే యాప్.. 13 ఏళ్లకే సొంత కంపెనీ!

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత కేరళకు చెందిన ఆధిత్యన్ రాజేశ్‌కు సరితూగుతుంది. 9 ఏళ్లకే మొదటి మొబైల్ యాప్‌ని సృష్టించాడు. 13 ఏళ్లకే సైట్స్, లోగోస్ క్రియేట్ చేసే కంపెనీ స్థాపించాడు. తోటివారు ఖాళీ సమయంలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఇతను సాఫ్ట్‌వేర్‌పై ట్రైనింగ్ తీసుకున్నాడు. తాను స్థాపించిన ట్రినెట్ సొల్యూషన్స్‌ని పాఠశాల స్నేహితుల సహాయంతో నడిపిస్తున్నాడు. అతని కంపెనీకి 12 మంది క్లయింట్స్ ఉన్నారు.
Similar News
News December 16, 2025
హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రికార్డ్

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్‌ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.
News December 16, 2025
బాలికల స్కూల్ డ్రాపౌట్స్.. UPలో ఎక్కువ, TGలో తక్కువ!

దేశంలో బాలికల స్కూల్ డ్రాపౌట్స్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం UP(57%) అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యల్పంగా తెలంగాణలో 31.1% డ్రాపౌట్స్ అయినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లలో 84.9 లక్షల మంది చదువును మధ్యలోనే ఆపేశారని, అందులో సగం కంటే ఎక్కువ బాలికలే ఉన్నారని పేర్కొంది. ఐదేళ్లలో 26.46 లక్షల మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించినట్లు ప్రకటించింది.
News December 16, 2025
2,757 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BA, B.COM, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


