News October 11, 2025

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

image

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.

Similar News

News October 12, 2025

జో బైడెన్‌కు రేడియేషన్ థెరపీ

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం వైద్యులు రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘జో బైడెన్ అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది ఆయన ఎముకలకు పూర్తిగా పాకింది’ అని ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 12, 2025

‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

image

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్‌కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌నూ కలిశారు.

News October 12, 2025

అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1911: భారత మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ(ఫొటోలో)జననం
1983: మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ జననం
1991: హీరోయిన్ అక్షర హాసన్(ఫొటోలో) జననం