News March 18, 2024

ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే కేటాయించాలని విజ్ఞప్తి

image

ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకే కేటాయించాలని ఆదోని జిల్లా సాధ‌న క‌మిటీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. టీడీపీని గెలిపించుకుని ఆదోనిలో ఆగిపోయిన అభివృద్ధిని మరలా కొనసాగించాలన్నారు. ఆదోని టికెట్టు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించరనే వార్తలు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయ‌న్నారు. చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు.

Similar News

News January 23, 2026

కర్నూలు: ‘వచ్చే నెల 19 వరకు టైం ఉంది. అప్లై చేసుకోండి’

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీదేవి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాద్యమం) మొదటి సంవత్సరంలో చేరేందుకు అభ్యర్థులు https://apbragcet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

News January 23, 2026

నిరక్షరాస్యత నిర్మూలనకు కర్నూలు కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలో గుర్తించిన 1,61,914 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ‘అక్షరాంధ్ర’, ఫ్యామిలీ సర్వే అంశాలపై ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం 16,191 మంది వాలంటీర్లను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.

News January 22, 2026

బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.