News October 22, 2024

కరీంనగర్‌లో ESI ఆస్పత్రికి విజ్ఞప్తి

image

TG: కరీంనగర్‌లో ESI ఆస్పత్రి నిర్మించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. జిల్లా మెడికల్ హబ్‌గా మారిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు వస్తున్నారని తెలియజేశారు. బీడీ, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందంటూ ESI ఆస్పత్రి ఏర్పాటు ఆవశ్యకతను సంజయ్ వివరించారు.

Similar News

News October 22, 2024

కేజీబీవీలకు రూ.24 కోట్లు రిలీజ్

image

AP: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) అదనపు గదులు, లేబొరేటరీలు ఇతర సివిల్ పనుల కోసం సమగ్ర శిక్ష రూ.24.84 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.20.61 కోట్లు నిర్మాణాలకు, రూ.4.23 కోట్లు రిపేర్ల కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అన్ని పనులను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

News October 22, 2024

వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్

image

రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్‌భూష‌ణ్‌ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్‌నెస్‌లో వెల్లడించారు.

News October 22, 2024

మా సెల్ఫ్ డిఫెన్స్ హక్కును భారత్ సమర్థించింది: ఇజ్రాయెల్

image

భారత్‌తో తమది సుదీర్ఘ మిత్రబంధమని ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్ అన్నారు. వెస్ట్ ఏషియాలో ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా ఢిల్లీ చాలా చేయగలదని పేర్కొన్నారు. ‘భారత్ మా సెల్ప్ డిఫెన్స్ హక్కును సమర్థించింది. వాళ్లు చాలా సమర్థులు. OCT 7న మాపై భీకర దాడి జరిగింది. సామాన్యులు చనిపోయారు. హమాస్‌ను దాదాపుగా తుడిచిపెట్టేశాం. గాజా, లెబనాన్‌లో కొంత పని మిగిలే ఉంది. మా ప్రజలు స్వేచ్ఛగా బతికేలా చేస్తాం’ అని అన్నారు.