News April 22, 2025

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని విజ్ఞప్తి

image

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కాగా APR 30 వరకు పొడిగించాలని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్‌కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.

Similar News

News April 22, 2025

అది చిన్ని బినామీ కంపెనీ: కేశినేని నాని

image

AP: విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబును కోరారు.

News April 22, 2025

విషాదం.. వడదెబ్బతో 9 మంది మృతి

image

TG: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరి కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్‌లో ముగ్గురు, ఉమ్మడి ADLBలో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 22, 2025

‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్‌లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.

error: Content is protected !!