News April 2, 2024

సాగర్ కుడి కాల్వకు నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి

image

AP: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేయాలని KRMBని ప్రభుత్వం కోరింది. ఈ నెల 8 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 5 టీఎంసీలు విడుదల చేయాలంది. గత అక్టోబర్‌లో అంగీకరించిన మేరకు నీటిని విడుదల చేయాలని గుర్తు చేసింది. అటు కేటాయించిన దాని కంటే తెలంగాణ 7.391 TMCల నీటిని అధికంగా వాడుకుందని, ఇకపై నియంత్రించాలని కోరింది.

Similar News

News January 30, 2026

ఆస్ట్రేలియా ఓపెన్: ఫైనల్లోకి అల్కరాజ్

image

స్పానిష్ టెన్నిస్ స్టార్ అల్కరాజ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీస్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 6-4, 7-6, 6-7, 6-7, 7-5 తేడాతో గెలుపొందారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మరో సెమీస్‌లో జకోవిచ్-సిన్నర్ తలపడనున్నారు. వీరిలో గెలిచే విజేతతో అల్కరాజ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. అటు ఒలీవియా గాడెక్కి-జాన్ పీర్స్ జంట మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా నిలిచింది.

News January 30, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<18999353>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,420 తగ్గి రూ.1,69,200కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,300 పతనమై రూ.1,55,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 30, 2026

OTTలోకి ‘నారీ నారీ నడుమ మురారి’

image

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న శర్వానంద్‌ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ OTTలోకి వచ్చేస్తోంది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.