News May 3, 2024
$110 బిలియన్ల షేర్లను బైబ్యాక్ చేయనున్న యాపిల్

యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా $110 బిలియన్ల విలువైన షేర్లను తమ వాటాదారుల నుంచి బైబ్యాక్ చేయనుంది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం. 2018లో అదే కంపెనీ $100 బిలియన్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయగా, ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. యాపిల్ 2021, 2022, 2023లోనూ $90 బిలియన్ల షేర్లను బైబ్యాక్ చేసింది. కాగా 10 అతిపెద్ద బైబ్యాక్‌లలో యాపిల్‌వే 6 ఉండటం విశేషం.
Similar News
News February 16, 2026
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే ఇవి తినాలి

హార్మోన్లను సమన్వయం చేయాలంటే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు కలగలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనెలు తీసుకోవాలి. రోజూ రెండు తెల్లగుడ్డుసొనలు, వాల్ నట్స్ తీసుకోవాలి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులను రోజూ తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది.
News February 16, 2026
పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.
News February 16, 2026
మేలో శ్రీవారి సేవలు, దర్శనాల కోటా షెడ్యూల్

AP: ఈ ఏడాది మే నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు, దర్శనాలు, వసతి టికెట్ల కోటా విడుదల షెడ్యూల్‌ను TTD ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆర్జిత సేవల టికెట్లకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. 21న కళ్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణ టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఉచిత ప్రవేశ దర్శన కోటా, 24న రూ.300 టికెట్లు, గదుల బుకింగ్, 27న శ్రీవారి సేవ కోటాను రిలీజ్ చేస్తారు.
#ShareIt


