News March 24, 2025

ఏఐ ఫీచర్లతో యాపిల్ వాచ్ కెమెరాలు!

image

కెమెరాలతో కూడిన సరికొత్త వాచ్‌లను యాపిల్ తీసుకురానుంది. AI సాంకేతికతతో ఇవి పనిచేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. కెమెరాల ద్వారా పరిసరాల గురించి సమాచారం అందించడంలో ఇవి ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి. స్టాండర్డ్ మోడల్స్‌లో ముందు వైపు, అల్ట్రా మోడల్స్‌లో పక్కకు కెమెరాలు ఉంటాయని పేర్కొన్నాయి. అయితే ఇవి ఫేస్ టైమ్ కాల్స్ కోసం కాకుండా AI ఫీచర్స్ ను ఉపయోగించుకునేలా ఉంటాయని వెల్లడించాయి.

Similar News

News December 8, 2025

రబీ వరి నాట్లు.. రైతులకు కీలక సూచనలు

image

వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న వరి రకాలకు చెందిన 21 రోజుల నారును సిద్ధం చేసిన పొలంలో మరీ లోతుగా కాకుండా పైపైన నాటుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనలు తుంచడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయాలు నాశనమవుతాయి. దీని వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. నారుమడులలో, వెదజల్లే పొలాల్లో నవంబర్-డిసెంబరులో భారీ వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.

News December 8, 2025

చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

image

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.

News December 8, 2025

‘వందేమాతరం’.. చర్చ ఈ అంశాలపైనే!

image

ఇవాళ పార్లమెంటులో జాతీయ గేయం ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం 1875 నవంబర్ 7న లిటరరీ జర్నల్ బంగదర్శన్‌లో ప్రదర్శించారు. 1882లో తన నవల ఆనందమఠ్‌లో దీనిని భాగం చేశారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని మోదీ ఆరోపించారు. దీంతో ఇవాళ ఏ అంశాలను చర్చలో ప్రస్తావిస్తారోనని ఆసక్తికరంగా మారింది.