News August 25, 2025

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 4 కెమెరాలు!

image

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ‘బ్లూమ్‌బర్గ్’ మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ‘ఫ్లిప్ కాకుండా యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ బుక్ స్టైల్లో ఉంటుంది. ఇందులో ఫేస్ ఐడీ కాదు టచ్ ఐడీ ఉంటుంది. సీ2 మోడెమ్, 4 కెమెరాలు ఉంటాయి. కేవలం ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని తెలిపారు. దీని ధర రూ.1,74,900 వరకు ఉండొచ్చని, 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News August 25, 2025

మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

image

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.

News August 25, 2025

TG PECET అడ్మిషన్ల సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

image

TG PECET-2025 (B.P.Ed, D.P.Ed ) అడ్మిషన్లకు సంబంధించి సెకండ్ (ఫైనల్) ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్ <>రిజిస్ట్రేషన్<<>>&వెరిఫికేషన్, పేమెంట్, సర్టిఫికెట్ల అప్‌లోడ్, 30న అర్హులైన అభ్యర్థుల లిస్టు ప్రకటన, కరెక్షన్స్, సెప్టెంబర్ 1న ఫేజ్-2 వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఉంటుంది. 3న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లో పెడతారు. SEP 4 నుంచి 9 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

News August 25, 2025

ఎంత ఒత్తిడి వచ్చినా పరిష్కారాన్ని కనుగొంటాం: మోదీ

image

US 50% టారిఫ్స్ ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో <<17512695>>PM మోదీ<<>> పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా దానికి పరిష్కారాన్ని కనుగొంటాం. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థంతో రూపొందుతోన్న విధానాలను చూస్తున్నాం. అలాంటి చర్యలను భారత్ వ్యతిరేకిస్తుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాం. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులకు నష్టం జరగనివ్వం’ అని అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.