News August 27, 2024
యాపిల్ కొత్త CFOగా భారతీయుడు

యాపిల్ కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి కెవన్ పారేఖ్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలసిస్ VPగా పనిచేస్తున్న ఆయన 2025, జనవరి 1న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక వ్యూహాల్లో 11 ఏళ్లుగా ఆయన కీలకంగా ఉన్నారు. కంపెనీ వరల్డ్ వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. ‘కెవన్ తెలివైనవారు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. CFOగా పర్ఫెక్ట్ ఛాయిస్’ అని CEO కుక్ ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారు.
Similar News
News January 19, 2026
కడప పోలీసులకు 76 ఫిర్యాదులు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన పోలీస్ అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. మొత్తంగా 76 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సకాలంలో విచారణ జరిపి, పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News January 19, 2026
భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.
News January 19, 2026
జియో హాట్స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

జియో హాట్స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్స్క్రైబర్లకు మాత్రమే.


