News April 5, 2025
KGBVల్లో 11 వరకు దరఖాస్తుల స్వీకరణ

AP: రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2025-26 అకడమిక్ ఇయర్కు సంబంధించి 6, 11వ తరగతులకు.. 7, 8, 9, 10, 12 క్లాసుల్లో మిగులు సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన విద్యార్థులు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయొచ్చని సూచించారు.
Similar News
News December 3, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 3, 2025
విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.
News December 3, 2025
పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.


