News February 25, 2025
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో పొరపాట్ల సవరణకు అవకాశమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.
వెబ్‌సైట్: https://eapcet.tgche.ac.in/
Similar News
News February 25, 2025
మార్చి 1న కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్‌లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.