News February 4, 2025
8th, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <
Similar News
News April 2, 2026
గుడ్ న్యూస్: రూ.7,358 కోట్లు దశలవారీ చెల్లింపు

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్‌క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.
News April 2, 2026
‘అతలాకుతలం’ వెనుక ఇంత ఉందా?

విపత్తుల కారణంగా భారీ నష్టం సంభవించినప్పుడు, వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ‘అతలాకుతలం’ అనే జాతీయం వాడతాం. పురాణాల ప్రకారం భూమి కింద ఏడు లోకాలు(అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం) ఉన్నాయి. ఇందులో సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్ని వాడుతున్నారు. ఆ లోకాలు తారుమారయితే పరిస్థితులు దెబ్బతిన్నట్లే. నిజ జీవితంలోనూ పరిస్థితులు తలకిందులయ్యాయని చెప్పేందుకూ దీన్ని వాడుతున్నాం.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 2, 2026
‘మావిగన్’ పేరుతో సినిమా టైటిల్ రిజిస్టర్?

AP రాజధాని కోసం YS జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పేరు SMలో ఎంత వైరలైందో తెలిసిందే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి పెట్టిన ఈ పేరుపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ సినీ నిర్మాత ‘మావిగన్’ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ పేరుతో సినిమా తీస్తారో లేదో చూడాలి మరి. SMలో ట్రెండయ్యే పదాలను సినిమా టైటిల్స్‌గా వాడడం కామనే.


