News March 22, 2025
నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <
Similar News
News March 22, 2025
ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

మధ్యప్రదేశ్ రేవా(D)లో అమానవీయ ఘటన జరిగింది. భార్య, అత్త వేధింపులు తాళలేక శివ్ ప్రకాశ్(26) అనే యువకుడు ఇన్‌స్టా లైవ్‌లో ఉరివేసుకున్నాడు. అతని భార్య ప్రియాశర్మ 44 ని.లపాటు వీడియో చూస్తున్నా సాయం చేయడానికి ప్రయత్నించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భార్య, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాశర్మకు ఉన్న వివాహేతర సంబంధం వల్లే భర్తతో విభేదాలు వచ్చాయని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
News March 22, 2025
ఇక రెండు నెలలు పండుగే!

మరికొన్ని క్షణాల్లో అతిపెద్ద క్రికెట్ పండుగ IPL-2025 మొదలు కానుంది. ఇప్పటికే ఓపెనింగ్ వేడుకలు మొదలవగా బాలీవుడ్ తారలు, స్టార్ సింగర్స్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. టపాసుల మోతలు, కోహ్లీ అభిమానుల కేరింతల నడుమ 7.30PMకు KKRvsRCB మ్యాచ్ ప్రారంభంకానుంది. గత గెలుపోటముల రికార్డులు పక్కన పెడితే ఈరోజు తొలి మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఈ మ్యాచులో గెలుపెవరిది? COMMENT
News March 22, 2025
రాష్ట్రంలో పవర్ కట్స్.. KTR ఫైర్

తెలంగాణలో నెలకొన్న పవర్ కట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పదోతరగతి పరీక్షల సమయంలో పవర్ కట్ వల్ల ఓ విద్యార్థి ఎదుర్కొన్న సమస్యను కేటీఆర్ దృష్టికి ఓ తండ్రి తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలు పవర్ కట్ ఉండటంతో మొబైల్ టార్చ్ ద్వారా, కారులో లైట్ వేసుకొని చదువుకున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్- కరెంట్ ఓ చోట ఉండలేవని కేటీఆర్ విమర్శించారు.