News March 23, 2024

4 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులకు దరఖాస్తులు

image

AP: అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మేలో జరిగే పరీక్షల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది. 26 జిల్లా కేంద్రాలతో పాటు ఢిల్లీలోనూ పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 2, 2024

రేపటి నుంచి టెట్

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్-2024 పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉ.9.30 నుంచి మ.12 వరకు, రెండో సెషన్ మ.2.30 నుంచి సా.5 వరకు ఉంటుంది. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సరైన ఆధారాలు చూయించి సెంటర్ దగ్గరున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని వారు https://aptet.apcfss.in/కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

News October 2, 2024

సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

image

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.

News October 2, 2024

వివాదంలో ‘యానిమల్’ హీరోయిన్

image

యానిమల్ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తృప్తి దిమ్రి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు వస్తానని తృప్తి రూ.5.5 లక్షలు తీసుకున్నారని సమాచారం. నిన్న ఈవెంట్‌కు ఆమె రాకపోవడంతో మోసం చేశారంటూ నిర్వాహకులు ఆమె ఫొటోపై పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.