News January 30, 2025

రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

image

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

Similar News

News December 31, 2025

25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్‌లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: ssc.gov.in

News December 31, 2025

2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

image

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్‌లో మెస్సీ సందడి

News December 31, 2025

2025: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

image

*Jan 8: తిరుపతిలో తొక్కిసలాట – ఆరుగురు మృతి
*Feb 22: SLBC టన్నెల్ ప్రమాదం – 8 మంది మృతి
*Apr 30: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి
*May 18: చార్మినార్‌ సమీపంలో అగ్ని ప్రమాదం-17 మంది మృతి
*June 30: సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు-54 మంది మృతి
*Oct 24: కర్నూలు వద్ద బస్సు దగ్ధం – 19 మంది మృతి
*Nov 1: పలాసలోని ఆలయంలో తొక్కిసలాట-9 మంది మృతి
*Nov 3: చేవెళ్ల బస్సు ప్రమాదం – 19 మంది మృతి