News October 31, 2024
మెడికల్ PG కోర్సులకు నేటి నుంచి దరఖాస్తులు
TG: 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక దశలవారీగా కౌన్సెలింగ్ ఉంటుంది. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో కోర్సులకు అడ్మిషన్లు పొందవచ్చు. జాతీయ కోటా పోగా మిగతా సీట్లన్నీ తెలంగాణ వాసులకే దక్కుతాయి.
Similar News
News January 2, 2025
మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
News January 2, 2025
ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.
News January 2, 2025
సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.