News December 22, 2024
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు

AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు రేపటి నుంచి ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్లో సబ్జెక్టుకు రూ.5తోపాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు రూ.25 ఫైన్‌తో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు.
Similar News
News October 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>
News October 18, 2025
పెళ్లి చేసుకున్న ‘దంగల్’ నటి

‘దంగల్’ సినిమా ఫేమ్ జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘దంగల్’ మూవీలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె బాలీవుడ్లో ‘సీక్రెట్ సూపర్ స్టార్, ది స్కై ఈజ్ పింక్’ వంటి సినిమాల్లో నటించారు. మత విశ్వాసాల కారణంగా 2019లో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు.
News October 18, 2025
అఫ్గాన్ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.