News April 25, 2025
నేటి నుంచి స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తులు

AP: స్పౌజ్ పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పింఛన్ ఇవ్వనుంది. ఇందుకు ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 30లోపు వివరాలు సమర్పిస్తే మే 1 నుంచి దాదాపు 89వేల మందికి కొత్తగా పెన్షన్ అందనుంది.
Similar News
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.
News January 5, 2026
మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <
News January 5, 2026
ఇంటర్వ్యూతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) 8 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. MSc (కెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 7న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000 చెల్లిస్తారు. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com


