News January 22, 2025

ఆ ఉద్యోగాల దరఖాస్తులకు రేపటి నుంచి అవకాశం

image

AP: సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/ జనరల్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31వరకు అవకాశం కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్ణయించింది. గత నెలలో 97 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాగా, మరో 200 పోస్టులను కలిపిన నేపథ్యంలో కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.

Similar News

News December 22, 2025

ఈ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ నిషేధం

image

క్రిస్మస్ సందడి మొదలవుతున్న వేళ కొన్ని దేశాల్లో మాత్రం ఈ పండుగపై నిషేధం ఉంది. ఉత్తర కొరియాలో క్రిస్మస్ జరుపుకుంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదు. సోమాలియాలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను నిషేధించారు. బ్రూనైలో ముస్లిమేతరులు పర్మిషన్ తీసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. తజకిస్థాన్‌లోనూ ఆంక్షలు ఉండగా, సౌదీలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదు.

News December 22, 2025

H-1B షాక్: ఇండియాలో చిక్కుకున్న టెకీలు.. అమెరికా వెళ్లడం కష్టమే!

image

ఇండియా వచ్చిన H-1B వీసా హోల్డర్లకు సోషల్ మీడియా వెట్టింగ్ రూల్స్‌తో US షాకిచ్చింది. వేలమంది అపాయింట్‌మెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు ఒక్కసారిగా జులైకి మారిపోయాయి. దీంతో మనవాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఆఫీసుల నుంచి అన్‌పెయిడ్ లీవ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఎప్పుడొస్తారో తెలియక టెన్షన్ పడుతున్నాయి.

News December 22, 2025

యూరియాను కౌలు రైతులు ఎలా బుక్ చేయాలి?

image

TG: కౌలు రైతులు యూరియా పొందాలంటే Fertilizer Booking App డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్ ఆప్షన్‌లో ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, యాప్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. తర్వాత యాప్‌లో కనిపించే వివరాలను నింపాలి. బుకింగ్ కోడ్ రాగానే కేటాయించిన సమయంలో డీలర్‌ వద్దకు వెళ్లి బుకింగ్‌ ఐడీ చూపించి, డబ్బు చెల్లిస్తే రైతుకు యూరియా ఇస్తారు.