News September 23, 2024

APPLY: CISFలో 1130 ఉద్యోగాలు

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో ఫైర్ విభాగంలో 1130 కానిస్టేబుల్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ పూర్తి చేసి, 18-23 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ లింక్: https://cisfrectt.cisf.gov.in/

Similar News

News November 18, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.