News September 19, 2025

APPLY: బీటెక్ అర్హతతో 119 ఉద్యోగాలు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <>అప్లై చేసుకోవచ్చు.<<>> 60% మార్కులతో B.Tech/B.E, M.A, CA, MBA పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 29 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలి ఏడాది ప్రతి నెలా ₹35K, రెండో ఏడాది ₹37,500, మూడో ఏడాది ₹40K, నాలుగో ఏడాది ₹43K జీతం ఉంటుంది.
#ShareIt

Similar News

News September 19, 2025

నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

image

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.

News September 19, 2025

గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు పెరిగాయి: సీఎం చంద్రబాబు

image

AP: నియోజకవర్గాల్లో జలాశయాలు నింపుకొని, ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత MLAలపై ఉందని CM చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘వర్షాకాలం తర్వాత 3మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలి. ఈ ఏడాది 2.1% వర్షపాతం తక్కువగా ఉంది. గతేడాది 18% అధిక వర్షపాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 1.25మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదు’ అని తెలిపారు.

News September 19, 2025

కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

image

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.