News March 26, 2024

APPLY: 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపటితో లాస్ట్

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయోపరిమితి, జీతభత్యాలు, పరీక్షా విధానం, ఇతర వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Similar News

News April 2, 2026

కరెంట్ అఫైర్స్

image

* డీజీసీఏ చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
* AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
* ‘పారాక్వాట్’ గడ్డిమందుపై తెలంగాణ తాత్కాలిక నిషేధం
* భారత్ తొలి డిజిటల్ సెన్సస్ ప్రారంభం
* గుజరాత్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి సంశోధక్ సర్వే నౌక
* భారత్ వేదికగా మే నెలలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు

News April 2, 2026

సేల్స్‌లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

image

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్‌ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.

News April 2, 2026

ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

image

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే