News August 20, 2024
APPLY: డిగ్రీ అర్హతతో 300 ఉద్యోగాలు

ఇండియన్ బ్యాంక్లో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 1-7-2024 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-85,920 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్సైట్: https://www.indianbank.in/
Similar News
News December 8, 2025
పల్నాడు: కంటతడి పెట్టించిన తల్లి ఆక్రందన

వినుకొండకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుందుర్తి హనుమత్ శాండిల్య (32) విహారయాత్ర నిమిత్తం అస్సాం వెళ్లి, ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. యువకుడి మృతదేహం ఆదివారం వినుకొండ చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రవి, రమాదేవి తమ ఏకైక కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ‘అమ్మతో ఒక్కసారి మాట్లాడయ్య’ అంటూ ఆ తల్లి చేసిన ఆక్రందన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


