News August 9, 2025

APPLY: రూ.96 వేల జీతంతో 550 ఉద్యోగాలు

image

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) 550 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్స్, రిస్క్ ఇంజినీర్స్, ఏఓ, బిజినెస్ అనలిస్ట్స్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ/పీజీ/బీటెక్, ఎంబీఏ/ఎంబీబీఎస్ పాసై ఉండాలి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.50,925 నుంచి రూ.96,765 వరకు ఉంటుంది. ఈ నెల 30లోగా <>newindia.co.in/recruitment<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News August 9, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నిర్మాతకు వార్నింగ్

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు. జీతాలు పెంచమని అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు తిరగబడితే తట్టుకోలేరని, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె తర్వాత కూడా విశ్వప్రసాద్ సినిమాలకు పనిచేయబోమన్నారు. ఆయన అసలు భారతీయుడే కాదని, ఇంగ్లిష్ కల్చర్‌ను తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.

News August 9, 2025

‘సృష్టి’ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

image

AP: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడు, విశాఖ KGH అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది.

News August 9, 2025

కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్: ISRO

image

HYD సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తోన్న విక్రమ్-1 లాంచ్ వెహికల్‌కు సంబంధించి తొలి దశ పూర్తయింది. షార్ సెంటర్‌లో కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్ అయినట్లు ISRO ప్రకటించింది. ఈ మోటార్ 11m పొడవు, 1.7m డయా మోనోలిథిక్ కాంపోజిట్ మోటారు, 30 టన్నుల ప్రొపెల్లెంట్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. స్పేస్ పాలసీలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సంస్థలకు ISRO మార్గనిర్దేశం చేస్తోంది.