News November 2, 2024

APPLY: నవంబర్ 28 వరకే ఛాన్స్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకు ఫాం-6, అభ్యంతరాలకు ఫాం-7, సవరణలకు ఫాం-8 నింపాలి. voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చూసుకోవచ్చు. > TOLL FREE 1950

Similar News

News October 23, 2025

7,267 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in

News October 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 44

image

1. భరతుని మేనమామ ఎవరు?
2. ఉత్తరుడు ఎవరి కుమారుడు?
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ఏమిటి?
4. గరుడ పక్షి ఏ దేవుడి వాహనం?
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 23, 2025

సేంద్రియ సేద్యానికి అనుకూలం.. BPT 2841 వరి రకం

image

BPT 2841 అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ నల్ల బియ్యపు రకం. అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలను కలిగి ఉంటుంది. భోజనానికి అనుకూలం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. ఎకరాకు సగటున 2.4 టన్నుల దిగుబడినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.