News January 16, 2025

APPLY.. 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

AP: గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ <>వైబ్‌సైట్‌లో<<>> తెలిపింది. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700. మిగతావారికి రూ.500. ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. https://apcob.org/careers/

Similar News

News December 11, 2025

నిద్ర తక్కువైతే!

image

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.

News December 11, 2025

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

image

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.

News December 11, 2025

అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

image

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.