News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
Similar News
News February 16, 2026
INDvsPAK.. రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

కొలంబో వేదికగా IND-PAK మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను అభిమానులు మొబైల్ ఫోన్స్, టీవీల్లో లైవ్ వీక్షించి ఆనందించారు. అలాగే INDvsUSA మ్యాచ్‌కు 26 కోట్లు, INDvsNAM మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి.
News February 16, 2026
జామలో గజ్జి తెగులును ఎలా నివారించాలి?

జామ పంటలో గజ్జి తెగులు ప్రధానంగా పచ్చి కాయలపై కనిపిస్తుంది. దీని వల్ల కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగకుండా రాలిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగులును నివారించడానికి లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 4 గ్రాముల కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 16, 2026
మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదా?

‘హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచర్య నియమాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతో మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదు’ అని పండితులు సూచిస్తున్నారు. భక్తికి లింగభేదం లేదని చెబుతున్నారు. ‘మహిళలు హనుమాన్ చాలీసా పఠించవచ్చు. కఠిన ఉపవాసాలు ఉండవచ్చు. సీతాదేవిని తల్లిగా గౌరవించిన హనుమంతుని పట్ల మహిళలు చూపించే నిష్కల్మషమైన భక్తి, మానసిక ఆరాధన అత్యంత పుణ్యప్రద ఫలితాలను ఇస్తాయి’ అని చెబుతున్నారు.


