News December 23, 2025

APPLY NOW: మనోహర్ పారికర్-IDSAలో ఉద్యోగాలు

image

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్(MP-IDSA)లో 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో రీసెర్చ్ ఫెలో, అసోసియేట్ ఫెలో, రీసెర్చ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.idsa.in

Similar News

News February 14, 2026

శివరాత్రి: రేపు ఉపవాసం ఎవరు ఉండాలి?

image

మనస్సును అదుపులో ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే ఆరోగ్యవంతులైన భక్తులందరూ శివరాత్రి నాడు ఉపవాసం ఉండవచ్చు. మోక్షం కోరేవారు, పాప ప్రక్షాళన కావాలనుకునేవారు, శివకృపకై పరితపించేవారు రేపు ఉపవాసం ఉండాలని పండితుల సూచన. ‘రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. మనోబలం పెరిగి ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి’ అంటున్నారు.

News February 14, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు

image

TG: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. BRS 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీజేపీ ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ సగానికంటే ఎక్కువ వార్డులు గెలుచుకోలేకపోయింది. వార్డుల పరంగా చూస్తే మొత్తం 2,581 వార్డుల్లో కాంగ్రెస్ 1,347, BRS 716, బీజేపీ 261, MIM, లెఫ్ట్ పార్టీలు, ఇతరులు 257 చోట్ల విజయం సాధించారు.

News February 14, 2026

70 స్థానాల్లో ఎంఐఎం విజయం.. భైంసా దక్కేనా!

image

TG: అసదుద్దీన్ ఒవైసీ పార్టీ MIM రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 70 వార్డు/డివిజన్ స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్ కార్పొరేషన్‌(60)లో కింగ్ మేకర్‌గా నిలిచిన ఈ పార్టీ(14 సీట్లు), భైంసా మున్సిపాలిటీలో మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉంది. రెబల్స్, కాంగ్రెస్ మద్దతుతో పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ చీఫ్ అసదుద్దీన్ మంతనాలు చేస్తున్నారు. బోధన్‌లోనూ MIM 12 వార్డులు గెలుచుకుంది.