News February 17, 2025
APPLY NOW: భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60% మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది. వెబ్‌సైట్: <
Similar News
News January 9, 2026
NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
News January 9, 2026
ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.


