News October 8, 2024
APPLY NOW: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

రైల్వేలో 14,298 గ్రేడ్-1, గ్రేడ్-3 టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ఐటీఐ, అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకుని, జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్సైట్: rrbapply.gov.in
Similar News
News April 5, 2026
ఈవెంట్లో సినీతారలు.. మరోసారి డ్రగ్స్ కలకలం

TG: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ తారామతి రిసార్టులో జాక్ జాన్సన్ ఈవెంట్‌పై ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ ఈవెంట్లో పలువురు సినీతారలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇందులో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
News April 4, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.
News April 4, 2026
రేపే ఉప్పల్‌లో మ్యాచ్.. వీటిపై నిషేధం

రేపు 3.30PMకు ఉప్పల్‌లో SRH, LSG తలపడనున్నాయి. స్టేడియం వద్ద క్లాక్‌రూమ్ ఉండదని, నిషేధిత వస్తువులు తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
వీటిపై నిషేధం: ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ పాడ్స్, కీ చైన్లు, పెన్నులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు.


