News July 17, 2024
APPLY NOW.. 17,727 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మరో వారం రోజుల్లో ముగియనుంది. డిగ్రీ పూర్తైన వారు జులై 24 వరకు అప్లై చేయవచ్చు. పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఫీజు రూ.100. మహిళలు, SC, ST, PWd వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. టైర్-1 పరీక్షలు సెప్టెంబర్/అక్టోబర్, టైర్-2 డిసెంబర్లో జరుగుతాయి.
Similar News
News November 24, 2025
WGL: రీకౌంటింగ్.. తొలిసారి ఐదుగురు పాస్!

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చరిత్రలో రీకౌంటింగ్ పెడితే తొలిసారి ఫెయిలైన ఐదుగురు పీజీ వైద్య విద్యార్థులు మళ్లీ ఉత్తీర్ణులు కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఈ విద్యార్థులు పాస్ కావడానికి, యూనివర్సిటీలో అక్రమంగా మార్కులు కలిపారని, డబ్బులు తీసుకొని పాస్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం గత నెల 4న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కొనసాగుతోంది.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


