News October 9, 2025
APPLY NOW: IPRCLలో 28 ఉద్యోగాలు

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(IPRCL)లో 28 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). వీటిలో 18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు, 10 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iprcl.in/
Similar News
News January 27, 2026
కరువుకు మామిళ్లు, కాలానికి నేరేళ్లు

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం వెనకున్న పురాణ గాథ

స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.


