News October 20, 2025

APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్‌ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్‌సైట్:sameer.gov.in/

Similar News

News October 20, 2025

మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

image

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.

News October 20, 2025

కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

image

TG: నిజామాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.

News October 20, 2025

BDLలో 110 పోస్టులు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 2025-26 సంవత్సరానికి 110 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/