News July 29, 2024

APPLY NOW.. 44,288 ఉద్యోగాలు

image

దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి <<13636461>>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. ఆగస్టు 5వ తేదీతో గడువు ముగుస్తుంది. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఏపీలో 1355, TGలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News September 18, 2025

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

image

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్‌ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‍లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

News September 18, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 18, 2025

మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

image

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.