News November 8, 2024
APPLY NOW: 457 ప్రభుత్వ ఉద్యోగాలు
UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 8న రెండు సెషన్లలో జరుగుతుందని తాజాగా UPSC ప్రకటించింది.
వెబ్సైట్: <
Similar News
News November 8, 2024
అనుచిత ప్రవర్తన.. జోసెఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
కెప్టెన్ హోప్‌పై ఆగ్రహంతో మ్యాచ్ మధ్యలో <<14549882>>గ్రౌండ్ వీడిన<<>> విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు మండిపడింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. తన ప్రవర్తనపై జోసెఫ్ విచారం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కు, విండీస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే నాలుగో ఓవర్లో ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగా లేదంటూ జోసెఫ్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
News November 8, 2024
DSC ఎంపికలో లోపాలు.. ఏడుగురు తొలగింపు
TG: DSC-2024లో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్లను ఖమ్మం జిల్లాలో తొలగించడం కలకలం రేపుతోంది. 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో కొందరికి అర్హత లేదని ఫిర్యాదు అందగా, వెరిఫికేషన్‌లో క్లీన్చిట్ వచ్చింది. 20 రోజులు ఉద్యోగం కూడా చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా, డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని విచారణలో బయటపడింది. దీంతో వారిని తొలగించారు.
News November 8, 2024
పవన్ కళ్యాణ్‌కు జీవోలతో వైసీపీ కౌంటర్
AP: వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని, జీవోల్లో వారి ప్రస్తావన లేదన్న Dy.cm పవన్ కళ్యాణ్‌కు YCP కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన జీవోలు, వారి నియామక, జీతాల ఉత్తర్వులను Xలో పోస్టు చేసింది. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేసింది.