News December 14, 2024

APPLY NOW: 526 ఉద్యోగాలు

image

ITBPలో 526 SI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ/బీటెక్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్/డిప్లొమా, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత ఉండాలి. SI ఉద్యోగాలకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
వెబ్‌సైట్: <>recruitment.itbpolice.nic.in<<>>

Similar News

News January 31, 2026

రేపు కేంద్ర బడ్జెట్: 47 డిమాండ్లు అందించిన TG

image

TG: కేంద్రం రేపు(ఆదివారం) FY26-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 47 డిమాండ్లను సమర్పించింది. కొత్త బడ్జెట్‌లో వాటిని నెరవేర్చాలని అభ్యర్థించింది. గోదావరి-మూసీ అనుసంధానానికి ₹6000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి మాస్టర్ ప్లాన్‌కు ₹17,212 కోట్లు ఇవ్వాలని కోరింది. HYDలో IIM ఏర్పాటు, RRR, రేడియల్ రోడ్లు, 8 కొత్త రైల్వే ప్రాజెక్టులు, మెట్రో ఫేజ్-2కు నిధులు ఈ డిమాండ్లలో ఉన్నాయి.

News January 31, 2026

T20WCకు ప్యాట్ కమిన్స్ దూరం

image

గాయం కారణంగా AUS స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ T20WCకు దూరమయ్యారు. గతంలో ప్రకటించిన జట్టులో 2 మార్పులు చేశారు. AUS సెలక్టర్లు కమిన్స్, మాథ్యూ షార్ట్‌ స్థానంలో పేసర్ బెన్ ద్వార్షుయిస్, మాట్ రెన్‌షాలకు అవకాశం కల్పించారు.
AUS జట్టు: మార్ష్(C), బార్ట్‌లెట్, కూపర్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, కుహ్నెమన్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపా, రెన్‌షా, ఇంగ్లిస్.

News January 31, 2026

విటమిన్ D ఉండే ఆహారాలు

image

మన ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ D చాలా అవసరం. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నవారికి శరీర పెరుగుదల ఆగిపోతుంది. చలికాలంలో ఎక్కువ ఎండ అందుబాటులో లేని ప్రదేశాల్లో విటమిన్‌ డి లభించదు అలాంటప్పుడు కొన్ని విటమిన్‌ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి సాల్మన్, రెడ్ మీట్, గుడ్డు సొన, లివర్‌లో ఎక్కువగా విటమిన్‌ డి ఉంటుంది. ఇలా కాకుండా సప్లిమెంట్లు వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.