News January 14, 2025
APPLY NOW: భారీ జీతంతో 608 ఉద్యోగాలు

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు <
Similar News
News January 9, 2026
అద్దె బస్సులు.. సమ్మె రద్దు

AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు <<18795223>>సమ్మె<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లే.
News January 9, 2026
పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్!

పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించే PSLలో 2కొత్త టీమ్స్ చేరాయి. సియాల్కోట్ ఫ్రాంచైజీని OG డెవలపర్స్ ₹58.38 కోట్లకు, హైదరాబాద్ ఫ్రాంచైజీని ₹55.57 కోట్లకు FKS గ్రూప్ దక్కించుకున్నాయి. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హైదరాబాద్ పేరుతో సిటీ ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ శాలరీ (₹26.75Cr+27Cr)తో దాదాపు సమానం కావడం గమనార్హం. మొత్తం 8 టీమ్స్‌తో మార్చి 26 నుంచి PSL ప్రారంభం కానుంది.
News January 9, 2026
సంక్రాంతి సినిమాలకు హైక్స్ లేనట్లే

TG: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశముంది. హైక్‌పై పలుమార్లు HC మండిపడటం, ఇకపై పెంచబోమని మంత్రి కోమటిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం తెలిసిందే. Rajasaabకు హైక్‌పై నేటి విచారణలో ‘మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇకపై మెమోలు ఇవ్వొద్దు’ అని HC తేల్చిచెప్పింది. దీంతో పండగకు వచ్చే ‘మన శంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలకు పెంపు లేనట్లే.


