News July 20, 2024
APPLY NOW.. 6,128 ఉద్యోగాలు
దేశంలోని బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటి(జులై 21)తో ముగియనుంది. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమ్స్, అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తైన 20 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News December 27, 2024
మన్మోహన్‌ను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: రాష్ట్రపతి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్‌ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ ఇక లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తికి కోల్పోయిందని చెప్పారు.
News December 27, 2024
మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన మరణం దేశానికి తీరని లోటు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధానిగా దేశానికి సేవలందించారు’ అని చంద్రబాబు కొనియాడారు. ‘మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, మానవతావాది. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని రేవంత్ పేర్కొన్నారు.
News December 27, 2024
దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.