News December 21, 2024

APPLY NOW: 723 ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్-సికింద్రాబాద్‌ 723 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు రేపే(DEC-22) లాస్ట్ డేట్. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. మెటీరియల్ అసిస్టెంట్ & సివిల్ మోటార్ డ్రైవ్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య, ఇతర పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్‌సైట్: <>aocrecruitment.gov.in<<>>

Similar News

News November 29, 2025

క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

image

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఫైనాన్స్ జాబ్స్‌‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

image

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్‌లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.