News October 14, 2025

APPLY NOW: ఇంటర్‌తో 7,565 పోస్టులు

image

ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రిపేర్ కావాలి. జీతం నెలకు ₹21,700, అలవెన్సులు అదనం. వెబ్‌సైట్: https://ssc.gov.in/

Similar News

News October 14, 2025

RGM: సీజనల్ వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు మస్ట్

image

ట్రేడ్ లైసెన్స్ లేకుండా సీజనల్ వ్యాపార విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు పొందాలన్నారు. వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

News October 14, 2025

హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం

image

AUSతో సిరీస్‌కు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై వచ్చిన <<17920712>>విమర్శలపై<<>> కోచ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ‘యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం 23ఏళ్ల పిల్లాడి గురించి ఇలా ప్రచారం చేయకండి. అతడి తండ్రి మాజీ ఛైర్మనో, మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. ఇప్పటివరకు సొంతంగా కష్టపడి ఆడిన అతడిని టార్గెట్ చేయడం సరికాదు. భవిష్యత్తులో మీ పిల్లల్ని కూడా ఎవరో ఒకరు టార్గెట్ చేయొచ్చని గుర్తుంచుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News October 14, 2025

మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

image

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.