News August 19, 2024

APPLY NOW.. 7,951 ఉద్యోగాలు

image

రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. వయసు: 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి ₹35,400, కెమికల్ సూపర్‌వైజర్‌కు 44,900 ఉంటుంది.

Similar News

News January 16, 2026

ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

image

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 16, 2026

9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

image

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

News January 16, 2026

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.