News October 19, 2024
APPLY NOW.. 8,113 ఉద్యోగాలు

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). మరిన్ని వివరాలకు <
Similar News
News December 1, 2025
లేటు వయసులో ప్రేమే స్ట్రాంగ్

35 ఏళ్ల తర్వాత జీవితంలోకి వచ్చే ప్రేమ, పెళ్లిలో బ్రేకప్లు, విడాకులు ఉండవని మహిళలు నమ్ముతున్నారని ‘సైకాలజీ టుడే’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంది. టీనేజ్ ప్రేమ, పెళ్లిళ్లలో ఆశలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి సరిగా లేకపోయినా మార్చుకోవచ్చని భావిస్తారు. కానీ 35 తర్వాత ఒక వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తులో మారే అవకాశ తక్కువ. అలాగే ఆ వయసులో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తెలిపారు.
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మేడారం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: CM

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార సంప్రదాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పొరపాట్లు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాతి పనులు, రహదారులు, గద్దెల చుట్టూ రాకపోకలకు మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి అంశంపై CM అధికారులకు సూచనలు చేశారు.


