News October 13, 2025

APPLY NOW: BELలో 88 పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 88 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్(49) పోస్టులకు అప్లైకి ఈనెల 30 ఆఖరు తేదీ కాగా.. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్(9) పోస్టులకు ఈనెల 28, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు(30) ఈనెల 29 చివరి తేదీ. పోస్టును బట్టి ITI, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://bel-india.in/

Similar News

News October 13, 2025

ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.

News October 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 6 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.gov.in/

News October 13, 2025

సర్వత్రా పరమాత్మను చూడటమే నిజమైన భక్తి

image

నిజమైన భక్తి అంటే ఆరాధన చేయడమే కాదు. సర్వం పరమాత్మే అని నమ్మాలి. ‘ఎవడు సమస్తమును నాయందు, నాయందు సమస్తమును చూచుచున్నాడో’ అనే గీతా వాక్యం దీన్ని బోధిస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు, జీవిలో ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి. సమస్తాన్ని భగవంతుడికి సమర్పించిన భక్తుడిని పరమాత్మ ఎప్పటికీ విడవదు. ఇలాంటి అనన్య భక్తి కలిగి ఉండేవారే నిజమైన భక్తులు. ఈ జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవడమే మన జీవిత పరమార్థం. <<-se>>#Daivam<<>>