News February 28, 2026

APPLY NOW: BSNLలో 120 పోస్టులు

image

<>BSNL<<>>లో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెలికామ్, ఫైనాన్స్) పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ మార్చి 8 – 15 వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. మార్చి 29న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: bsnl.co.in/

Similar News

News February 28, 2026

భారత్ vs వెస్టిండీస్.. రేపు వర్షం పడుతుందా?

image

రేపు కోల్‌కతాలో భారత్-వెస్టిండీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టనుంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న IND టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపు కోల్‌కతాలో వర్షం పడే ఛాన్సుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వర్షం ముప్పు లేదని వాతావరణ అధికారులు చెప్పారు. ఆకాశం క్లియర్‌గా ఉందని, ఎలాంటి మబ్బులు లేవని పేర్కొన్నారు.

News February 28, 2026

అఫ్గాన్‌తో వార్.. పాక్‌పై ట్రంప్ పొగడ్తలు

image

అఫ్గాన్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని యుద్ధంగా మార్చిన పాక్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ దేశ ప్రధాని, ఆర్మీ జనరల్‌ను అద్భుతమైన నాయకులుగా అభివర్ణించారు. వారిని తాను ఎంతో గౌరవిస్తానన్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకునే అవకాశం తనకు ఉన్నప్పటికీ.. అలా చేయబోనని పేర్కొన్నారు. మరోవైపు తాలిబన్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాక్‌కు ఉందని అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెప్పుకొచ్చింది.

News February 28, 2026

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

image

TG: హైదరాబాద్ నుంచి అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్‌(17069/17070) సర్వీస్‌గా నడపనున్నట్లు తెలిపింది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని పేర్కొంది. దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించింది.