News December 2, 2025
APPLY NOW: IIBFలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF) 10 Jr ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.iibf.org.in
Similar News
News March 28, 2026
మెదడుకు విశ్రాంతినిచ్చే ‘బ్రెయిన్‌కేషన్’

ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ‘బ్రెయిన్‌కేషన్’ అనే కొత్త ట్రెండ్ ప్రాచుర్యం పొందుతోంది. ఇది మెదడుకు ఇచ్చే చిన్న సెలవు లాంటిది. రోజువారీ డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా, పని ఒత్తిడి నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ.. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే దీని ఉద్దేశం. ఫోన్‌ను పక్కన పెట్టడమే కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనసుకు నచ్చినట్లు గడపాలి. దీన్నే ‘బ్రెయిన్‌కేషన్’ అంటారు.
News March 28, 2026
హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలివే..

మన శరీరంలోని జీవక్రియలు సరిగా జరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా హార్మోన్లదే కీలకపాత్ర. అయితే వీటిలో అసమతుల్యత రావడం వల్ల వంధ్యత్వం, మొటిమలు, మధుమేహం, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మొటిమలు, జుట్టు రాలడం, బరువులో మార్పులు, నిద్రలేమి, ఆకలి పెరగడం/ తగ్గడం వంటి లక్షణాల ద్వారా హార్మోన్ల అసమతుల్యతను ముందుగానే గుర్తించవచ్చంటున్నారు..
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో మల్చింగ్ వల్ల లాభాలేంటి?

ఆయిల్ పామ్ పాదులలో మల్చింగ్ చేయుటవల్ల నీటి ఆదా, కలుపు మొక్కల నివారణ జరుగుతుంది. ఇంకా నేలలో సేంద్రియ పదార్థాలు మరియు పోషకాల లభ్యత, నేలలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎదిగిన తోటల్లో ముక్కలుగా కోసిన ఆకులు, మగపూల గుత్తులు, కొబ్బరి డొప్పలు, కొబ్బరి ఆకులు, మొక్కజొన్న మరియు గెలలు కోసిన తర్వాత వచ్చిన ఆకులను చాఫ్ కటర్ సహాయంతో చిన్నముక్కలు చేసి పాదులలో మల్చింగ్‌గా వేయాలి.


